ఫతేనగర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ క్రాంతి ముదిరాజ్
కూకట్పల్లి ఆగస్టు 25 (త్రినేత్రం న్యూస్) : కూకట్ పల్లి నియోజకవర్గంలో నిరుపేదలకు తెలంగాణ ముఖ్యమంత్రి నేతృత్వంలో కూకట్ పల్లి ఇంచార్జ్ బండి రమేష్ ఆధ్వర్యంలో నియోజకవర్గం మూసాపేట సర్కిల్ ఫతేనగర్ డివిజన్ పరిధిలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుస్థిర పాలన అందిస్తోందని ఫతేనగర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ క్రాంతి ముదిరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వ నిరుపేద పేదింటి మహిళలకు ఉచిత కరెంటు 200 యూనిట్లు అదేవిధంగా 500 కే గ్యాస్ అదేవిధంగా నిరుపేద మహిళలు నలుమూలలకు ఎక్కడికెళ్లినా ఉచిత బస్సు సౌకర్యం, తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా ఇప్పుడు కొత్తగా టిఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించినప్పటికీ ఒక్క రేషన్ కార్డు కూడా అమలు చేయని సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే నిరుపేదల ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు పంపిణీ కొనసాగుతుందని, పెళ్లి అయినా 10 నుంచి 12 సంవత్సరాలైనా వాళ్లందరికీ కూడా ఇంతవరకు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు.
టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వమే నిరుపేదల కుటుంబాలకు ఇచ్చే ఆస్కారం కొనసాగించామని, అదేవిధంగా కూకట్ పల్లి నియోజకవర్గంలో గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాలుగా చెరువులు కబ్జాలకు గురవ్వడంతో కేసీఆర్ ప్రభుత్వం అస్తవ్యస్తంగా మారిందనారు. గత ప్రభుత్వంలో జరిగిన అనిశ్చిత ప్రజలు తిరస్కరించడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం చేపట్టిన మొట్టమొదటగా హైడ్రా తో కబ్జాలు తొలగించి చెరువుల శృంగీకరణ మొదలుపెట్టారని తెలిపారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో నల్ల చెరువులో బోటింగ్ ఏర్పాటు చేసి ప్రజలందరికి ప్రజా ప్రయోజనాత్మకంగా చేపడుతున్నారు జరిగిందని తెలిపారు. నేటి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రెండు నుంచి రెండున్నర సంవత్సరాలు గడుస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకు పోతుందన్నారు. అదేవిధంగా ప్రతి వారికి కూడా సంక్షేమ పథకాలు అందిస్తూ అదేవిధంగా రాష్ట్రంలో నిరుద్యోగులకు 60 వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని, గత పాలకనేతలను సూటిగా ప్రశ్నిస్తున్నా. రేవంత్ రెడ్డి పాలనలో జరుగుతున్న అభివృద్ధి కూకట్ పల్లి శాసనసభ్యుడి కళ్ళకు కనిపించడం లేదా? అవి అవాస్తవాలు కాదా అని ప్రజలు కూడా ఆలోచించాలని సూచించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


