వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: నవ భారత నిర్మాత,సాంకేతిక విప్లవ పితామహుడు భారత మాజీ ప్రధాని, భారత రత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ సేవలు స్మరించు కుందాం : రాజశేఖర్ ఆవుటి , రాష్ట్ర పీసీసీ సెల్ కన్వీనర్ పెండ్యాల అనంతయ్య పేద ప్రజల పెన్నిధి నిరుపేదల ఆపద్బాంధవుడు భారత మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భముగా వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాజశేఖర్ ఆవుటి , జిల్లా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి, రాష్ట్ర పీసీసీ సెల్ కన్వీనర్ పెండ్యాల అనంతయ్య కలిసి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలతో ఘన నివాళి అర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా వారు భారతదేశానికి చేసిన సేవలు కాంగ్రెస్ పార్టీ నాయకులు స్మరించుకోవడం జరిగింది. ఐటీ రంగాన్ని అగ్ర పదంలో నిలిపిన నాయకుడని, పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపిన ఆపద్బాంధవుడని దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహా యోధుడని ఈ సందర్భంగా నాయకులు మిద్య రాములు డి శేషికుమార్, అబ్దుల్ కాలిద్ కొనియాడారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


