Free Primary PM Srividya : ఫ్రీ ప్రైమరీ పీఎం శ్రీవిద్యను అంగన్వాడి కేంద్రాల్లోనే నిర్వహించాలి

TRINETHRAM NEWS

విద్యా బోధన బాధ్యతను అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ కు ఇవ్వాలి

ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు ప్రైవేట్ స్కూలు నడపడానికి అనుమతి ఇవ్వకూడదు
అదనపు పనులు రద్దు చేయాలి
అంగన్వాడి టీచర్స్ వెల్ఫేర్ ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి
సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఎం శంకర్ నాయక్
త్రినేత్రం న్యూస్ (ప్రతినిధి) అచ్చంపేట: ఫ్రీ ప్రైమరీ పీఎం శ్రీవిద్య పైన రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిర్ణయం సరైనదిగా లేదని ఇది ప్రభుత్వ విద్యను బలోపేతం చేయకపోగా ప్రభుత్వంలో భాగమైన అతి ముఖ్యమైన ఆరు సంవత్సరాల లోపు పిల్లల మానసిక శారీరక ఎదుగుదలకు కీలకపాత్ర పోషిస్తున్న ఐసిడిఎస్ వ్యవస్థను నిర్వీర్యం చేయాలని కుట్ర దాగి ఉందని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఎం శంకర్ నాయక్ ఆరోపించారు. అచ్చంపేట ఆర్డిఓ కార్యాలయంలోని ఏవో గారికి అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ సిఐటియు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి శంకర్ నాయక్ అంగన్వాడీ యూనియన్ టీచర్స్ అండ్ హెల్పర్ యూనియన్ జిల్లా నాయకురాలు పార్వతమ్మ మాట్లాడుతూ.. 2020 జూలై 29న కరోనాకాలంలో నూతన జాతీయ విద్యా విధానం చట్టాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది పూర్తిగా ఐసిడిఎస్ మరియు ప్రభుత్వ విద్యనే నిర్వీర్యం చేసే విధంగా ఉందని ప్రభుత్వ విద్యా స్థానంలో కార్పొరేట్లకు జోక్యం కల్పిస్తున్నదని విద్యార్థులకు సైన్సు కాకుండా మూఢనమ్మకాలను పెంచి పోషించే విధంగా ఈ విద్యా విధానంలో మార్పులు చేయడం జరిగిందని అన్నారు. ఈ ప్రమాదకరమైన చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా ఆపాలని ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని గత నాలుగు సంవత్సరాలు నుండి విద్యార్థి మరియు అంగన్వాడి సంఘాలు మేధావులు ప్రజాస్వామ్యవాదులు రాష్ట్ర ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు నిరసనలు పోరాటాలు నిర్వహిస్తూ వస్తున్న ఇలాంటి సమయంలో వీటిని పరిశీలించి పరిష్కారం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని అన్నారు.

కానీ ఈ అంశాలకు భిన్నంగా నూతన జాతీయ విధా విద్యా విధానం చట్టాన్ని ఫ్రీ ప్రైమరీ పీఎం శ్రీ విద్య ద్వారా రాష్ట్రంలో అమలు చేయాలని నిర్ణయం చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి తగదని హెచ్చరించారు. ఇది ఐసిడిఎస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడంతో పాటు పేద ప్రజలకు తీవ్రమైన నష్టాన్ని కలుగజేస్తుందని అన్నారు. శ్రీ ప్రైమరీ పీఎం శ్రీ విద్యను అంగన్వాడి కేంద్రాల్లోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. విద్యాబోధన బాధ్యతను అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ఇవ్వాలి విద్యా వాలంటీర్లకు నిర్ణయించిన వేతనాన్ని అదనంగా అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ చెల్లించాలి ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు ప్రైవేట్ స్కూల్స్ నడపడానికి అనుమతి ఇవ్వకూడదని అన్నారు ఐసిడిఎస్ సంబంధంలేని బీఎల్ఓ తదితర అదనపు పనులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు బుసిరా అంగన్వాడి తదితరులు ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Free Primary PM Srividya

You cannot copy content of this page

Scroll to Top