Oath-Taking Ceremony : ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న శాసనసభ్యులు

TRINETHRAM NEWS

తేదీ : 18/08/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చింతలపూడి నియోజకవర్గం, మండలం, రాఘవపురం గ్రామం మాటూరి. వెంకటరామయ్య పిఎసి ఎన్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఆయన ప్రమాణస్వీకారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో డైనమిక్ శాసనసభ్యులు సాంగా. రోషన్ కుమార్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ పథకాలు అందిస్తుంది అని అన్నారు.
కుల, మత భాష, పార్టీ భేదాలు లేకుండా సమన్వయ పాలన కొనసాగుతుంది అని సూచించారు. సూపర్ సిక్స్ పథకాలు అర్హులైనటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి అందయని తెలపడం జరిగింది. ప్రమాణస్వీకారం చేసినటువంటి మాటూరి. వెంకటరామయ్య కూడా మాట్లాడుతూ ఈ పదవి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. బాధ్యతగా రైతులకు ఎటువంటి కష్టనష్టాలు రాకుండా, లేకుండా ఈ పదవిని కొనసాగిస్తాను అని అన్నారు. రైతుల పంటపొలాలకు సంబంధించిన మందులు తక్షణమే ప్రభుత్వం అందించాలని శాసనసభ్యులను కోరగా వెంటనే స్పందించి డైనమిక్ శాసనసభ్యులు తెప్పిస్తానని భరోసా ఇవ్వడం జరిగింది.
ప్రమాణ స్వీకారానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా టిఫిన్స్, టి , మంచినీరు ఎటువంటి, లోటుపాట్లు రాకుండా లేకుండా చూసుకోవడం జరిగింది. కార్యక్రమంలో ఉమ్మడి కూటమి, నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. అనంతరం లింగపాలెం మండలం, ధర్మాజీ గూడెం గ్రామంలో గోగుంట. నాగేశ్వరరావు వసంత కుమారి, కుమారుడు దుర్గా సాయి, ఆమోజీల వివాహానికి శాసనసభ్యులు హాజరయ్యారు. వివాహ దంపతులను నిండు నూరేళ్లు, చల్లగా సంతోషంగా, సిరి సంపద కలిగి ఉండాలని, పిల్ల పాపలతో మంచి ఆరోగ్యంగా ఉండాలని మనస్పూర్తిగా దీవించడం జరిగింది. ఆయనతోపాటు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

oath-taking ceremony

You cannot copy content of this page

Scroll to Top