Trinethram News : అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో వర్షాలు తో దుమ్ముదుమారం..పిడుగులు తో కూడిన భారీ వర్షాలు .. ప్రజలు అవసరం ఉంటేనే బయటకి రాండి అని హెచ్చరించిన వాతావరణ శాఖ
బంగాళాఖాతం మధ్య ప్రాంతాలలో సముద్ర మట్టానికి సగటున 3.1 – 5.8 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని దీని ప్రభావంతో ఆగస్టు 13, బుధవారం పశ్చిమమధ్య, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఆ తదుపరి 48 గంటల్లో ఇది బలపడే సూచనలు ఉన్నాయని తెలిపారు.
బుధవారం(13-08-25): పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, తూర్పుగోదావరి, నంద్యాల జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
గురువారం(14-08-25): కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాల
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


