Ramavat Ravindra Kumar : రక్షాబంధన్ సాంప్రదాయం భారతీయ జీవన ఔన్నత్యానికి నిదర్శనం

TRINETHRAM NEWS

బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్.

దేవరకొండ ఆగష్టు 09 త్రినేత్రం న్యూస్. ప్రేమానురాగాలకు రాఖీ పౌర్ణమి ప్రతీక అని బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పేర్కొన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ కు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ……. దేశ వ్యాప్తంగా జరుపుకునే రక్షా బంధన్ పండుగ సహోదరత్వానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. జీవితాంతం తమకు అండగా ఉండాలని ఆడబిడ్డలు తమ అన్నాదమ్ముల్లకు అనురాగంతో చేతికి రక్షా బంధనాన్ని కట్టడం గొప్ప సందర్భం అని ఆయన తెలిపారు.

రక్షాబంధన్ సాంప్రదాయం భారతీయ జీవన ఔన్నత్యానికి నిదర్శనమని, ప్రజల్లో సహోదరత్వాన్ని మరింతగా పెంపొందిస్తుందని ఆయన ఆకాంక్షించారు. ప్రేమనుబంధాలకు ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి పండుగను నియోజకవర్గ ప్రజలంతా ఆనందోత్సాహల్లో జరుపుకోవాలని ఆయన కోరారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

The tradition of Raksha Bandhan

You cannot copy content of this page

Scroll to Top