మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని టీబీజీక్స్ కేంద్ర కార్యాలయంలో ఘనంగా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్ధాంతకర్తగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం తన జీవిత కాలం రాష్ట్ర సాధనకే త్యాగం చేసిన మహనీయుడని కొనియాడారు. తెలంగాణ ఏర్పాటు కోసం ఎన్నో ఉద్యమాలు 1969 తెలంగాణ ఉద్యమం, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, నాన్ ముల్కీ ఉద్యమం, మలిదశ తెలంగాణా ఉద్యమం లో పాల్గొని దేశ వ్యాప్తంగా వేదికల ద్వారా తన ప్రసంగాలతో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి తెలియజేశారు అని తెలిపారు. ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పి ఉద్యమ స్ఫూర్తితో ప్రజలను చైతన్యం చేసిన గొప్ప వ్యక్తి అన్నారు. ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శప్రాయం, స్ఫూర్తిదాయకమన్నారు.
తెలంగాణ ప్రజలకు నీళ్లు, నిధులు, నియామకాలు అందించాలన్న సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఉద్యమ నాయకునికి ఎన్నుకొని ఉద్యమ కార్యాచరణ రూపొందించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కృషి చేశారన్నారు. కోట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు సాధించే దిశగా ప్రో॥ జయశంకర్ ఆశయాలను కొనసాగించే దిశగా కేసీఆర్ ముందుకు సాగారని తెలిపారు.
జయశంకర్ కలలుగన్న బంగారు తెలంగాణ సాధన కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించి కోటి ఎకరాలకు సాగు నీరు అందించే ప్రయత్నం చేశారని అన్నారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నీరుగారుస్తూ కన్నెపల్లి పంపు హౌజ్ నుండి నీటిని ఎత్తిపోసి అవకాశం ఉన్నా నీటిని ఎత్తిపోయకుండా రైతుల పొలాలను ఎండబెడుతుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోవు ఐలయ్య యాదవ్, నారాయణదాసు మారుతి,బోడ్డు రవీందర్ కల్వచర్ల కృష్ణవేణి, బాదే అంజలి, జనగామ కవిత సరోజినీ పర్లపల్లి రవి, జెవి రాజు, చల్లా రవీందర్ రెడ్డి, పిల్లి రమేష్ నీరటి శ్రీనివాస్ కనకలక్మి, సుజాత, కిరణ్ జీ, బుర్ర వెంకటేష్,రామరాజు, హరికృష్ణ, సట్టు శ్రీనివాస్, ఇరుగురాళ్ల శ్రావణ్, చింటూ గుర్రం పద్మ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


