త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, పడమరఖండ్రిక ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం (పిఎసిఎస్) నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం పిఎసిఎస్ నందు సోమవారం జరిగింది. చైర్మన్ గా పుత్సల శ్రీనివాస్, డైరెక్టర్ లు గా కర్రి పార్వతి, మట్టా వెంకటరమణ లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ముఖ్య అతిధిగా హాజరై నూతన కమిటీ సభ్యులు అందరినీ అభినందించారు. అనంతరం వారందరినీ పూలమాలలు, దుశ్శాలువాలతో సత్కరించారు. ఈ సంధర్బంగా వారంతా ఎమ్మెల్యే వేగుళ్ళ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


