WhatsApp Image 2024 01 20 at 11.51.11 AM
నేడు గర్భగుడిలోకి రాములోరి విగ్రహం
ఉత్తరప్రదేశ్:జనవరి 20
నేడు ప్రధాన ఆలయ గర్భగుడిలోకి
అయోధ్య రాముడి విగ్రహం ప్రవేశించనుంది.
దాదాపు 500 ఏళ్ల తర్వాత శ్రీరాముడు తన మందిరా నికి తిరిగి వస్తున్నాడు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఉండడంతో నేటి నుంచి బయటి వ్యక్తులను అయో ధ్యలోకి అనుమతించరు.
కాగా అంతకుముందు జనవరి 18న వివేక్ సృష్టి ట్రస్ట్ నుండి రాంలాలా విగ్రహాన్ని ట్రక్కులో రామాల యానికి తీసుకువచ్చారు.
విగ్రహాన్ని ఆలయ ప్రాంగణం లోకి తీసుకెళ్లేందుకు క్రేన్ సాయం తీసుకున్నారు. జనవరి 16 ప్రారంభమైన రామాలయంలో సంప్రోక్షణకు ముందు పవిత్రమైన ఆచారాలు జనవరి 21 వరకు కొనసాగుతాయి.
వేడుక ప్రధాన కార్యక్రమం జనవరి 22 న జరుగుతుంది.
