Deputy Commissioner : దోమల నిర్మూలనకు ప్రజలు సహకరించాలని

TRINETHRAM NEWS

డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకట స్వామి

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకట స్వామి కోరారు. వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా శుక్రవారం నిర్వహిస్తున్న డ్రై డే ఫ్రై డే కార్యక్రమ నిర్వహణ తీరును సంజయ్ గాంధీ నగర్ లో ఆయన పరిశీలించారు. ఈ సంధర్భంగా స్థానికులకు దోమల నివారణపై అవగాహన కల్పించారు . నిలువ ఉన్న మంచి నీళ్ళలో కూడా దోమల లార్వా పెరిగే అవకాశం ఉంటుందని అన్నారు పూల కుండీలు , ఎయిర్ కూలర్లు , గోళాల్లో , పాత టైర్లలో , కొబ్బరి చిప్పలలొ నిలువ ఉన్న నీటిని మున్సిపల్ సిబ్బంది తొలగించారు.

మురుగు నీటి కుంటల్లో ఆయిల్ బాల్స్ వేశారు . గాంధీనగర్ సింగరేణి పాటశాల సమీపంలో ఉన్న మరుగు దొడ్డి ఆవరణను మున్సిపల్ సిబ్బంది పరిశుభ్రం చేశారు. అనంతరం లక్ష్మీ పురం పట్టణ ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన వైద్య శిబిరంలో మున్సిపల్ సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ సానిటరీ ఇన్స్పెక్టర్ నాగ భూషణం , వార్డు అధికారులు , సానిటరీ జవాన్లు , మున్సిపల్ , మెప్మా సిబ్బంది పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

cooperate in eradicating mosquitoes

You cannot copy content of this page

Scroll to Top