Bridge Collapse : బురద గెడ్డ వంతెన కుప్పకూలే దశలో

TRINETHRAM NEWS

అరకు ప్రధాన రహదారికి రవాణా ముప్పు

అల్లూరిజిల్లా త్రినేత్రం న్యూస్, అరకులోయ (జూలై 31): అరకు–చాపరాయి–పాడేరు ప్రధాన రహదారిలో అరకు గ్రామం వద్ద రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఉన్న బురద గెడ్డ వంతెన ప్రమాదకర స్థితిలోకి చేరింది. నిత్యం వాహనదారులు, పర్యాటకులు, విద్యార్థులు ఈ వంతెనపై ప్రయాణించాల్సి వస్తుండగా, ఇప్పటికే అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నా అధికారులు స్పందించకపోవడంపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
“ప్రతి రోజు భయంతో ఈ వంతెన దాటుతున్నాం… అయినా పట్టించుకునే వారే లేరు,” అని వాహనదారులు వాపోయారు. వర్షాకాలంలో వంతెనలో ఏర్పడ్డ గోతులు మరింత ప్రమాదానికి దారి తీసే అవకాశముందని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేశారు.
తక్షణ చర్యలు తీసుకుని వంతెనను పునరుద్ధరించాలని, గోతులు పూడ్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పెద్ద ప్రమాదం సంభవించేలోపు ప్రభుత్వం స్పందించాలని హెచ్చరిస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Burada Gedda Bridge on

You cannot copy content of this page

Scroll to Top