చట్ట వ్యతిరేక పనులు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు గోదావరిఖని I టౌన్ ఇన్స్పెక్టర్ ఏ.ఇంద్రసేనారెడ్డి.
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో తేదీ 18- 7 -2025 రోజున ఒక వ్యక్తి కళ్యాణ్ నగర్ లో వ్యాపారం చేస్తున్నటువంటి ఇద్దరు వ్యాపారస్థులకు ఫోను చేసి ఒక్కొక్కరు తలా పది లక్షల రూపాయలు ఇవ్వాలంటూ లేనిచో వారి కుటుంబ సభ్యులకు హాని చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడినాడు. అంతేకాకుండా గత కొంత కాలం క్రితం గోదావరిఖని చౌరస్తాలో ఒక వ్యక్తిని మర్డర్ చేసింది నేనేనంటూ అదే పరిస్థితి నీ ఫ్యామిలీకి కూడా పడుతుందని సదరు వ్యక్తులను బెదిరించినాడు. అట్టి ఫోను బెదిరింపులతో భయపడిపోయిన వ్యాపారస్తులు ప్రాణభయంతో భయాందోళన గురై తేది: 22-07-2025 రోజున ధైర్యం చేసి ఒక వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆదేశాల మేరకు ఎస్సై రమేష్ కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించినారు. సదరు వ్యాపారి దరఖాస్తులో అతనిని బెదిరించిన వ్యక్తి ఫోన్ నెంబర్ తెలుపగా అట్టి ఫోన్ నెంబర్ ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గోదావరిఖని పోలీసులు చాకచక్యంగా పట్టుకుని అతనిని గోదావరిఖని చంద్రశేఖర్ నగర్ కి చెందిన యాదనవేని తిరుపతి s/o వెంకటి గా గుర్తించి ఈరోజు అరెస్టు చేసి అతని వద్ద బెదిరింపులకు పాల్పడడానికి ఉపయోగించిన ఫోన్ ను స్వాధీన పరుచుకొని రిమాండ్ కు తరలించడం జరిగింది అన్ని సీఐ తెలిపారు నిందితుని వివరాలు
*తిరుపతి యాదన వేణి s/o వెంకటి, వృత్తి హమాలి r/o చంద్రశేఖర్ నగర్ గోదావరిఖని
నిందితుడు తిరుపతి గత ఐదు సంవత్సరాల క్రితం తన సొంత ఊరు అయినా కాన్కూర్ ఇందారం, జైపూర్ మండలం మంచిర్యాల జిల్లా నుండి చంద్రశేఖర్ నగర్ గోదావరిఖనికి వచ్చి కిరాణం షాపులలో హమాలీ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ మధ్యనే చంద్రశేఖర్ నగర్ లో ఇల్లు కూడా కొనుగోలు చేసి కుటుంబంతో ఉంటున్నాడు. కిరాణం షాపు యజమానుల యొక్క కదలికలు రోజు చూస్తూ వారిని బెదిరించి డబ్బులు సులభంగా తీసుకోవచ్చని తేదీ 18-07-2025 రోజున రాత్రి 10:30 గంటల నుండి 11:00 గంటల మధ్య వారికి ఫోన్లు చేసి బెదిరించాడు. మొదటగా వ్యాపారస్తులు సైబర్ నేరాలకు సంబంధించింది కావచ్చు అనుకున్నారు తర్వాత రెండు మూడు రోజులు భయాందోళనలకు గురి అయ్యారు ఎవరైనా చట్ట వ్యతిరేక పనులు చేసిన ఎవరిని ఉపేక్షించేది లేదని ఒకవేళ అలాంటి పనులు చేసినట్లయితే వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తప్పవని సీఐ హెచ్చరించినారు ఇట్టి కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి, ఎస్సైరమేష్, సిబ్బంది ఉన్నారు .
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


