25 వరోజు జోరుగా ప్రచారం. త్రినేత్రం న్యూస్, ( పాడేరు) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు,తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదేశానుసారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం పాడేరు మండలం, చింతల వీధి పంచాయతీలో ఏపీ టూరిజం డైరెక్టర్ రమేష్ నాయుడు ఆధ్వర్యంలో 25వ రోజు ఘనంగా నిర్వహించడం జరిగింది.
అనంతరం ఆయన మాట్లాడుతూ యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పనలో భాగంగా ఇప్పటికే డీఎస్సీలో 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలకు పరీక్షలు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిదని ఆయన అన్నారు. పోలీస్ శాఖలో నియామకాలు, పారిశ్రామిక రంగంలో 8.5 లక్షల ఉద్యోగాలు కల్పనకు ఒప్పందాలు జరిగిందన్నారు.గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క ఉపాధ్యాయ ఉద్యోగం కూడా తీయలేదని ఆయన తప్పుపట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహణ కార్యదర్శి కోడా వెంకట సురేష్ కుమార్, యువ నాయకులు వనుగు సురేంద్ర,కిల్లు శంకర్ నాయుడు,బాషా తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


