బిక్కవోలు మండలం బిక్కవోలు శ్రీ లక్ష్మి గణపతి దేవస్థానం, శ్రీ గోలింగేశ్వర సుబ్రహ్మణ్యశ్వర స్వామి దేవస్థానాలను మరియు పెదపూడి మండలం గొల్లల మామిడాడలో శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం, శ్రీ కోదండ రామాలయం దేవస్థానాలను ప్రసాదం స్కీం ద్వారా మౌలిక సదుపాయలు కలిపించే నేపథ్యంలో, ఆయా ఆలయాలను సందర్శించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మరియు టూరిజం అధికారులు ఈ ఈ మరియు వారి బృందం.
అనపర్తి:త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, ఈ సందర్భంగా అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మాట్లాడుతూ… అనపర్తి నియోజకవర్గంలోని బిక్కవోలు మరియు గొల్లల మామిడాడలోని నాలుగు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయం, గోలింగేశ్వరస్వామి ఆలయం గొల్లలమామిడాడలో కోదండరాముల వారి ఆలయం, సూర్యనారాయణమూర్తి వారి ఆలయం వీటిని అభివృద్ధి చేయాలని తద్వారా టెంపుల్ టూరిజం ని డెవలప్ చేయాలనేది నా ఆలోచన.
నేను మరియు పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి పురందేశ్వరి, కలిసి కేంద్ర సాంస్కృతిక మరియు టెంపుల్ టూరిజం శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్,ని కలిసి ఈ ఆలయాలను అభివృద్ధి చేయాలని కోరడం అందుకు వారు ప్రతిపాదనలు తయారు చేయమని రాష్ట్ర టూరిజం శాఖను ఆదేశించడం జరిగింది. దీని నిమిత్తం ఈరోజు టూరిజం శాఖ నుండి అధికారులు ఇక్కడకు రావడం, ప్రతిపాదనలు తయారు చేయడం కోసం ఈ ప్రాంతాలను సందర్శించడం జరిగింది.
ఇక్కడ రెండు,మూడు ప్రతిపాదనలు తయారు చేయడం జరిగింది. వాటిని వారు పరిశీలించి ఆమోదయోగ్యమైన ప్రతిపాదనను తయారు చేసిన తర్వాత దానిని రాష్ట్ర పర్యాటక శాఖ నుండి కేంద్ర పర్యాటక శాఖకు పంపించి ఆమోదం పొంది నిధులు మంజూరు చేయించడం జరుగుతుంది.
ఈ ప్రాంతం యొక్క రూపురేఖలు మారడమే కాకుండా ఈ నాలుగు ఆలయాల చారిత్రక ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేసే అవకాశం దక్కుతుందన్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండల, పెదపూడి మండల ఎన్ డి ఏ నాయకులు, బిక్కవోలు, గొల్లల మామిడాడ గ్రామాల ఎన్ డి ఏ నాయకులు, కార్యకర్తలు, టూరిజం అధికారులు భాస్కరరెడ్డి, వీర పావని, నిరంజాన్ పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


