Srinivasa Rao : సాంస్కృతిక స్వచ్ఛంద సంస్థల నివాళులు కోట

TRINETHRAM NEWS

తేదీ : 24/07/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రమైన మచిలీపట్నం భావ తరంగణి ఆధ్వర్యంలో స్థానిక చిత్రకళ సంపద్ భవనంలో కోటా. శ్రీనివాసరావు సంస్కరణ సభ జరిగింది. బాలాజీ అధ్యక్ష ఉపన్యాసం చేస్తూ తెలుగు, కన్నడ , తమిళ , హిందీ, మలయాళం భాషల్లో ఏడు వందల యాభై చిత్రాలలో నటించి అనేక అవార్డులు , పద్మశ్రీ బిరుదు ను అందుకున్నారన్నారు. అదేవిధంగా రాజకీయరంగంలో కూడా మంచి సేవలు అందించారని ఆయన తెలిపారు.

నట, రాజకీయ జీవితంలోను నిజాయితీగా పనిచేసినటువంటి కోటకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇవ్వడం సముజతమని బాలాజీ అన్నారు. సామాజిక సేవా కార్యకర్త పి.వి.ఫణి కుమార్ మాట్లాడుతూ కోట శ్రీనివాసరావు గొప్ప నటుడే కాదు, రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, వాటిని మించిన గొప్ప మానవతావాది అని అన్నారు. ఆయన మరణం ప్రతి ఒక్కరిని బాధించిందని తెలపడం జరిగింది. అదేవిధంగా భావతరంగని అధ్యక్షులు భవిష్య మాట్లాడుతూ కోటా గురించి వివరించారు. కోట శ్రీనివాసరావు నటించినటువంటి చిత్రాల గురించి వాళ్లకు తెలిసినంతగా చెప్పారు.

ఈ కార్యక్రమంలో ధూళిపాల. శ్రీరామ్ చంద్ర మూర్తి, ఐటిఐ కళాశాల కరస్పాండెంట్, కొత్త గుండు. రమేష్, వెనిగళ్ళ. ఉమామహేశ్వరరావు, జె. శేఖర్, . నాగలక్ష్మి, సూరి శెట్టి. హరికృష్ణ, పాల్గొన్నారు. కోట. శ్రీనివాసరావు కాంస్య విగ్రహాన్ని కృష్ణాజిల్లా కంకిపాడు మెయిన్ రోడ్డుపై ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Tributes from cultural charities

You cannot copy content of this page

Scroll to Top