Ketawat Baburam Naik : చింతపల్లి ఎంఈఓ కు వినతిపత్రం అందజేత

TRINETHRAM NEWS

తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు విద్యార్థుల రాజకీయ పార్టీ జిల్లా అధ్యక్షులు కేతావత్ బాబురామ్ నాయక్.
దేవరకొండ జులై 24 త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజక వర్గంలోని చింతపల్లి మండలంలో గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు విద్యార్థుల రాజకీయ పార్టీ జిల్లా అధ్యక్షులుకేతావత్ బాబురామ్ నాయక్ నాయకత్వంలో విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి మండల విద్యా అధికారి (ఎంఈఓ) ని కలసి వినతిపత్రం అందజేశారు. చింతపల్లి పట్టణం పరిధిలో అనుమతుల్లేకుండా నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలలు విద్యా చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని,విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయనిఆరోపించారు. గుర్తింపు లేకుండా పాఠశాలలు నడిపించడం, అనుమతి
లేకుండా ఎల్కేజీ, యూకేజీ తరగతులు నిర్వహించడం, అధిక ధరలకు పబ్లికేషన్ పుస్తకాలు మరియు యూనిఫాంలను బలవంతంగా అమ్మడం, అర్హత లేని టీచర్లను నియమించడం, పర్మిషన్ లేకుండా హాస్టళ్లను నడపడం, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బార్ షాపులు, ఫంక్షన్ హాల్స్ సమీపంలో పాఠశాలలు నడుపుతూ విద్యార్థులకు హాని కలిగే పరిస్థితులు సృష్టించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. విద్యా వ్యవస్థను వ్యాపారంగా మార్చే యాజమాన్యాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని, అలాగే వీరికి సహకరించే అధికారులపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ఎంఈఓ ని కోరారు. తక్షణ స్పందన లేకపోతే జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో పోరాటం కొనసాగిస్తామని బాబురామ్ నాయక్ హెచ్చరించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Chintapalli handed over the

You cannot copy content of this page

Scroll to Top