Trinethram News : గత తొమ్మిది రోజులుగా పేపర్ మిల్లు కార్మికుల సమస్యలపై ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతున్న జక్కంపూడి రాజా ని అర్ధ రాత్రి సుమారు 150 మంది పోలీసులతో వచ్చి హౌస్ అరెస్ట్…
తెల్లవారుజామున 3 గంటలకు రాజమహేంద్రవరం పేపర్ మిల్లు ఎదురుగా ఉన్న కళ్యాణమండపంలో ఉన్న జక్కంపూడి ని రేపు ఉదయం 9 గంటలకు ఆమరణ నిరాహారదీక్షకు సిద్ధమవుతున్న తరుణంలో ఆయనను ఇంటికి తరలించి హౌస్ అరెస్ట్ చేశారు…
పేపర్ మిల్లు కి 500 మీటర్ల దూరంలో ఏ విధమైన ఆందోళనలు, నిరసనలు చేపట్టకూడదు అనే సాకుతో అక్రమంగా అరెస్ట్ చేసి దీక్షను ముందస్తుగా భగ్నం చేసిన పోలీసులు…
జక్కంపూడి రాజాతో పాటూ మరో 50 మందిని ప్రివెంటివ్ అరెస్ట్ చేసి 3 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


