Trinethram News : Jul 21, 2025, బంగ్లాదేశ్‌లోని ఢాకాలో సోమవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మైల్‌స్టోన్ పాఠశాలపై బంగ్లాదేశ్ ఎయిర్‌ఫోర్స్ శిక్షణ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందినట్లు సమాచారం. విద్యార్థులు ఉన్న సమయంలోనే ప్రమాదం జరగడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. సంబంధిత అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


