MLA Raj Thakur : 117వ వార్షిక బోనాల బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

TRINETHRAM NEWS

హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. హైదరాబాద్ లో ఘనంగా జరుగుతున్న శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి 117వ వార్షిక బోనాల బ్రహ్మోత్సవాలలో రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంలో ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, రథోత్సవం మరియు శోభాయాత్రల్లో భక్తులతో కలిసి పాల్గొన్న రాజ్ ఠాకూర్ అమ్మవారికి ప్రత్యేకంగా బోనం సమర్పించి రాష్ట్ర ప్రజల శాంతి, సమృద్ధి మరియు ఆరోగ్యానికి మించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉంది.

ఇది మన భక్తి, భౌతిక స్థితిని ప్రతిబింబించే పండుగ మాత్రమే కాక, సమాజ సమైక్యతకు చిహ్నం కూడా”అన్నారు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, “బోనాల పండుగ మన చారిత్రక గర్వకారణం. ఇలాంటి వేళల్లో ప్రజలతో మమేకమవుతూ వారికి అండగా ఉండటం ఒక ప్రజాప్రతినిధిగా నా ధర్మం” అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆతిధిగా వ్యవహరించారు మరియు ఈ పండుగ నిర్వహణను విజయవంతంగా పూర్తి చేయడానికి శ్రమించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ramagundam MLA Raj Thakur

You cannot copy content of this page

Scroll to Top