వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : నవాబుపేట్ మండల పరిధిలోని పులు మామిడి గ్రామంలో తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ నిర్వహించుతున్న సందర్భంగా పులుమామిడిగ్రామంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశం ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులు బోనాల పండుగ నిర్వహిస్తున్న సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు బోనాలుపోతురాజుల విన్యాసాలు ఆటలు ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ డప్పుల దరువులతో విద్యార్థులు అంగరంగ వైభవంగా బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, గోపాల్, పూలమ్మ, విజయ, సుజాత,అంగన్వాడి టీచర్లు, సంపత్ కుమారి, భవాని ఆయాలు, సువర్ణ, రేణుక, పాఠశాల ఎస్ఎంసి చైర్మన్, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ యువజన సంఘాల నాయకులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


