MLA Gorantla : ఇచ్చిన ప్రతీ హామీని అమలుచేస్తున్నాం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల… కడియం, ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్నామని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి వ్యాఖ్యానించారు.బుధవారం కడియం మండలం కడియపులంక, వెంకయ్యమ్మపేట గ్రామాల్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలతో మమేకమై కూటమి అధికారంలోకి వచ్చాక జరిగిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించడం ద్వారా మహిళలకు భారం తప్పిందన్నారు.

తల్లికి వందనంతో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నగదు జమ చేస్తున్నామన్నారు. వైసిపి హయాంలో గ్రామాల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే ఎన్నో పనులు చేపట్టామని ఆయన తెలిపారు. స్ధానిక నాయకులు,టిడిపి రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు మార్గాని సత్యనారాయణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో సాగుతుందన్నారు. ఏడాదిలో జరిగిన అభివృద్ధిని మించిన అభివృద్ధి మరో నాలుగేళ్లలో జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. ప్రజాప్రభుత్వాన్ని ప్రతీ ఒక్కరూ ఆశీర్వదించాలని కోరారు. అనంతరం ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన పలువురు ఎమ్మెల్యే గోరంట్ల వద్ద తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం వెంకయ్యమ్మపేట అంగన్వాడీ కేంద్రం లో పరికరాలు, పుస్తకాలు ఎమ్మెల్యే గోరంట్ల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ పాటంశెట్టి రాంజీ,టిడిపి రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు మార్గాని సత్యనారాయణ,రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి మజ్జిపద్మ,ఎంపిపి వెలుగుబంటి ప్రసాద్,మండల టిడిపి అధ్యక్షులు వెలుగుబంటి నాని,మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు బోడపాటి గోపి,ఎమ్మార్ పాలెం సర్పంచ్ అన్నందేవుల చంటి, సత్తి గిరి,బొరుసు శేషగిరి,వారారాము, గోరు నాగేశ్వరరావు,పాతూరి రాజేష్, వరగోగుల వెంకటేశ్వరరావు,బండి నాగమణి,ఎం.విజయ,జల్దికృపారావుబిజెపినాయకులు బొర్సుసుబ్రహ్మణ్యం, కొటికలపూడి వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

We are implementing every

You cannot copy content of this page

Scroll to Top