CPI : సిపిఐ పార్టీ రాష్ట్ర నాయకులు చందు నాయక్ ను హత్య చేయడం దుర్మార్గమైన చర్య

TRINETHRAM NEWS

నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలి

తెలంగాణ గిరిజన సమాఖ్య(TGS) భద్రాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా శ్రీనివాస్ డిమాండ్

కొత్తగూడెం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మంగళవారo తెల్లవారుజామున మలక్ పేట మారుతీ నగర్లో సిపిఐ పార్టీ రాష్ట్ర నాయకులు చందు నాయక్ ను కొంతమంది దుండగులు హత్య చేయడం దుర్మార్గమైన చర్య అని తెలంగాణ గిరిజన సమాఖ్య భద్రాద్రి కొత్తగూడెంజిల్లా ప్రధాన కార్యదర్శిభూక్యా శ్రీనివాస్ అన్నారు.

మంగళవారము శేషగిరి భవనంలో గిరిజన సమాఖ్య జిల్లా సమితి సమావేశంలో ఆర్ చందు నాయక్ కు ఘన నివాళులు అర్పించారు అనంతరం జరిగిన సంతాప సభలో జిల్లా కార్యదర్శి భూక్య శ్రీనివాస్ మాట్లాడుతూ చిన్ననాటి నుంచి కమ్యూనిస్టు భావాలను సోషలిస్టు భావాలను ఆకర్షితులై కమ్యూనిస్టు పార్టీలో పనిచేస్తూ అంచలంచలుగా ఎదుగుతూ సిపిఐ పార్టీ రాష్ట్ర నాయకులుగా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా చందు నాయక్ పనిచేస్తున్నారన్నారు భూమికోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం పోరాడే కమ్యూనిస్టు పార్టీ బాటలో నగరం నడిబొడ్డున భూ పోరాటాలు నిర్వహించి ఇండ్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలు లేని పేదలకు ఇండ్లు ఇళ్ల స్థలాలకై భూ పోరాటాలు నిర్వహించి పేదలకు భూములు పంచిన చందు నాయక్ ప్రజల్లో మరింత బలపడడంతో అంచలంచలుగా ఎదుగుతున్న గిరిజన ముద్దుబిడ్డను ఓర్వలేని దుర్మార్గులు కక్షగట్టి హత్యకు పాల్పడినటువంటి దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో గుగులోతు రామచందర్,గణేష్, నగేష్, బాలాజీ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The killing of Chandu Naik

You cannot copy content of this page

Scroll to Top