అల్లూరిజిల్లా (అరకులోయ) త్రినేత్రం న్యూస్ జులై 16 : విద్యుత్ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా అరకువేలి మండలంలోని సుంకరమెట్ట పంచాయతీలో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం అదానీకి లబ్ధి చేకూర్చేందుకే స్మార్ట్ మీటర్లు బలవంతంగా బిగించాలని చూస్తోందని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కిండంగి రామారావు ఆరోపించారు.
మండల నాయకుడు, సుంకరమెట్ట సర్పంచ్ గెమ్మెలి చిన్నబాబు మాట్లాడుతూ, “అదివాసీ ప్రాంతాల్లో సిమ్ కార్డు ద్వారా మీటర్లు రీచార్జ్ చేయడం అసాధ్యం. విద్యుత్‌ను అందరికీ అందుబాటులో ఉంచాలంటే పాత మీటర్లే కొనసాగించాలి,” అని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం ప్రజావ్యతిరేక విధానాలతో విద్యుత్ రంగాన్ని కూడా ప్రైవేటు పరం చేస్తుండటాన్ని విమర్శించారు. మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


