Road Blocked : డిండి మండల కేంద్రంలో విద్యుత్ సమస్య పై రాస్తా రోకో

TRINETHRAM NEWS

డిండి( గుండ్ల పల్లి) జులై 08 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో విద్యుత్ సమస్య పరిష్కారానికై జాతీయ రహదారిపై డిండి గ్రామ యువకులు ప్రజలు భారీ ఎత్తున రాస్తారోకో నిర్వహించడం జరిగింది . ఈ సందర్భంగా వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కావడం జరిగింది . విద్యుత్ సమస్య చాలవుందని., ఇంతకుముందు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అయ్యేదని , ఇప్పుడు మాత్రం సరిగ్గా సరఫరా లేక ప్రజలు చిన్నపిల్లలు ఇబ్బందులకు గురవుతున్నారని, అధికారులను అడిగితే నిర్లక్ష్యంగా సమాధానాలు ఇస్తూ మాకేమీ తెలీదు మాకేమీ ఎరగనట్లు ప్రవర్తిస్తున్నారని , విద్యుత్ అధికారులను ,మరియు సిబ్బందిని ఫోన్ లో సంప్రదిస్తే సమాధానం ఇస్తలేరని , ఇంకా ఎన్నిరోజులు ఇలా విద్యుత్ లేకుండా ఇబ్బందులను భరించాలని , చుట్టూ ప్రక్కల గ్రామాలలో వుండటం ఎలా?

డిందిమండల కేంద్రంలో వుండక పోవడం విడ్డూరం అని , డిండి మండలం తెలగాణ రాష్ట్రం కాదా? లేక ఇండియా బోర్డర్లోనే లేదా అని అధికారులను అందరూ ఏకతాటిపై వుండి ప్రశ్నిచాలని అందరూ ప్రజలు, యువకులు నాయకులు కలిసి జాతీయ రహదారి పై రాస్తారోకో (ధర్నా చేపట్టారు. దీనికి స్పందించిన విద్యుత్ ఏఈ మరియు అధికారులు విచ్చేసి ఆదివారం లోపు సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.దీంతో ఆందోళన విరమించడం జరిగింది. ఆందోళనకారులు ఆదివారం వరకు సమస్య పరిష్కారం కాకపోతే మళ్లీ ఉద్యమ కార్యచరణ రూపొందించి డిండి బంద్ కు పిలుపునిచ్చి సోమవారం రోజు తీవ్ర ఆందోళన చేస్తామని అధికారులకు హెచ్చరించారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్సై రాజు ఆందోళనకారులను పక్కకు జరిపి రహదారిని క్లియర్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిండి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున యువకులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Road blocked in Dindi

You cannot copy content of this page

Scroll to Top