MLA Jare Adinarayana : విశిష్ట సేవలకు గాను జిల్లా, సైన్స్ అధికారి ఎస్ చలపతిరాజు ను ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. 06.07.2025 – ఆదివారం. కొత్తగూడెం విద్యాశాఖలో ఎన్నో ఏళ్లుగా ఉత్తమ సేవలందించి జిల్లా సైన్స్ విభాగ అధికారిగా బాధ్యతలు నిర్వర్తించిన సరస్వతి, చలపతిరాజు పదవీ విరమణ పొంది వేడుకలు ఈనెల 30 వ తారీఖున కొత్తగూడెం క్లబ్ నందు ఘనంగా సన్మానించబడ్డ తరుణంలో ఈ కార్యక్రమానికి, అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, అందుబాటులో లేనందున ఈ రోజు కొత్తగూడెంలో వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసారు
ఈ సందర్భం గా ఎమ్మెల్యే, మాట్లాడుతూ, విద్యారంగంలో చలపతిరాజు,కృషి మరువలేనిదని యువత, భవిష్యత్ నిర్మాణం కోసం ఆయన చేసిన శ్రమ ప్రశంస నీయమన్నారు. జిల్లా సైన్ విభాగం, అభివృద్ధికి వారి సేవలు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు అనంతరం సరస్వతి చలపతిరాజు దంపతులను ఘనంగా సన్మానించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Jare Adinarayana felicitated

You cannot copy content of this page

Scroll to Top