త్రినేత్రం న్యూస్, ( పాడేరు ) నియోజకవర్గఇంచార్జ్ : అటవీ సహజ సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతున్న పాలకవర్గాలు. అల్లూరి ఆశయాలకు తూట్లు పొడుస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వ్యతిరేకంగా ఆదివాసి యువత ఉద్యమాలు నిర్వహించాలని, ఆదివాసి గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు పి. అప్పలనరస పిలుపునిచ్చారు.
పాడేరు ఆదివాసీ గిరిజన సంఘం కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు జయంతి కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన కార్యదర్శి, పి. బాల్ దేవ్ అధ్యకత ఘనంగా నిర్వహించారు. ముందుగా చిత్రపటానికి పూలమాల లేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, అప్పలనరస మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటమే చేయడమే మాత్రమే కాదు, ఆదివాసుల అటవీ సంపద రక్షణకై కూడా అల్లూరి సీతారామరాజు పోరాటం చేశారని, అటువంటి గొప్ప ఆశయం కలిగిన అల్లూరి సీతారామరాజు యొక్క త్యాగాలను ప్రతి ఒక్కరు స్మరించుకోవాలని అన్నారు. నేటి పాలకులు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అటవీ సంపదను కార్పొరేట్ కంపెనీలకు దార్ధత్వం చేయడం కోసం నూతన అటవీ పాలసీ, నూతన మైనింగ్ పాలసీ తీసుకొచ్చారాని, ఆదివాసి గ్రామసభకున్న అధికారాన్ని సవరించి, మండల పరిషత్ కు అధికారం ను కట్టబెట్టి నేడు నేడు హైడ్రో పవర్ ప్రాజెక్టు పేరుతో (జల్ జంగిల్ జమీన్) ను అదాని కంపెనీకి (నీరు,అడవి,భూమి) కట్టబెడుతూ ఇటీవల కాలంలో చంద్రబాబు ప్రభుత్వం జిఓ నెంబర్ 51 ఉత్తర్వులు జారీ చేసిందని అన్నారు.
అల్లూరి జిల్లా పరిధిలో సుమారు 4 హైడ్రోపవర్ ప్రాజెక్టులను అదాని కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడం కోసం పాలకులు,ఆదివాసులకు అన్యాయం చేస్తున్నారనీ ఆరోపించారు. మరో పక్క అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు నిర్వహిస్తూ ఆదివాసీ సమాజాన్ని పక్కతో పట్టిస్తున్నారని ఆరోపించారు. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కు వ్యతిరేకం జరిగే ఉద్యమంలో ప్రజానీకంతో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొని ఆదివాసి హక్కుల చట్టాలు రక్షించడం కోసం సిద్ధమవ్వాలని కొనియాడారు.
ఈ కార్యక్రమం ఎస్. ఎఫ్. ఐ జిల్లా అధ్యక్షులు కార్తీక్, చిన్నరావు, కొర్ర బాలయ్య, కొర్ర నర్సయ్య, శ్రీను, కిల్లు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


