కూటమి అధికారంలోకి వచ్చాక మౌలిక సదుపాయాలతో కళకళలాడుతున్న గ్రామాలు
కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు
కొత్తపేట : త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, విధ్వంసమే ఆలంబనగా పనిచేసిన వైసీపీ ప్రభుత్వానికి, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనిస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. గురువారం రావులపాలెం మండలం లక్ష్మీ పోలవరం గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మొదటగా గ్రామంలో ఉన్న రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్, అన్న ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తరువాత ఆయన ప్రజలతో మమేకమయ్యారు.
గత ఐదేళ్లలో గ్రామాల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే ఎన్నో పనులు చేపట్టామని ఆయన తెలిపారు. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో అమలుపరిచిన హామీలు, సంక్షేమం, అభివృద్ధి గురించి వివరించారు. స్వయంగా ఎమ్మెల్యే ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన పలువురు ఎమ్మెల్యే బండారు వద్ద తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో రాష్ట్రంలో భయానకమైన వాతావరణం ఉండేదని కూటమి అధికారంలోకి వచ్చాక ప్రశాంతత నెలకొందని అన్నారు. విధ్వంసం పాలైన రాష్ట్రాన్ని గాడిన పెట్టి వికాసం దిశగా పయనింపచేస్తున్నామన్నారు. సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా ఇంటింటికి వెళ్లి పలకరిస్తున్నప్పుడు ప్రజల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుందని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


