వరంగల్ జిల్లా. 03 జులై త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. అమెరికా తెలుగు సంబరాలకు వరంగల్ వాసి పరంజ్యోతికి ఆహ్వానం అమెరికా లో ఈ నెల 4 మరియు 5 తేదీలలో జరగనున్న 8వ అమెరికా తెలుగు సంబరాలకు వరంగల్ జిల్లా దేశాయిపేట వాసి ఓయాసిస్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్.జెఎస్. పరంజ్యోతి కి ఆహ్వానం అందింది తెలుగు సంబరాలలో ఆధునిక ప్రపంచంలో పిల్లల పెంపకం విధానం పిల్లల ఎదుగుదల అభివృద్ధికి ఉపయోగించే పద్ధతులు వ్యూహాలు, అభ్యాసాలు సామాజిక నిబంధనలు, విలువలు ,ప్రవర్తనలు తెలుగు సంస్కృతిని గుండె నిండా పద సంపద గుణ సంపద జ్ఞాన సంపన్నులుగా ఆయుష్షు సంపన్నులుగా తీర్చిదిద్దే విధానాల పై బోధించడం తోపాటు క్రమశిక్షణ అంశాలపై ప్రసంగించనున్నట్లు డాక్టర్ జె ఎస్ పరంజ్యోతి తెలిపారు ఈ సదస్సులో వివిధ దేశాలకు సంబంధించిన విద్యావేత్తలు,సినీ ప్రముఖులు సినీ రచయితలు, పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు తదితరులు పాల్గొంటున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్.జెఎస్ పరంజ్యోతి పాల్గొనడం పట్ల వివిధ పాఠశాల నిర్వాహకులు విద్యావేత్తలు స్థానిక నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


