జూన్ 26, 2026
TRINETHRAM NEWS

తేదీ : 01/07/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పోలవరం నియోజకవర్గం, జీలుగుమిల్లి మండలం, బర్రింకలపాడు లో అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పెన్షన్లు అందజేశారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ప్రతినెల ఒకటవ తేదీన పెన్షన్ల పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పేదల ముఖంలో చిరునవ్వు చూడాలని , వాళ్ల ఆర్థిక ఇబ్బందులను గట్టు ఎక్కించాలనే ఉద్దేశంతో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ పథకాలు అర్హులైనటువంటి ప్రతి కుటుంబానికి ఇస్తున్నామని పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA distributing pensions

You cannot copy content of this page