TRINETHRAM NEWS

నేడు వారి ఖాతాల్లోకి సొమ్ము.. 4,07,323 మందికి లబ్ధి

Trinethram News : అమరావతి..

నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు.. పథకం కింద రికార్డు స్థాయిలో నివేశన స్థలాలను పంపిణీ చేయడంతోపాటు ఇళ్లను మంజూరు చేసిన సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ..

ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం చేయడంతోపాటు రాయితీపై సామగ్రి అందిస్తోన్న విషయం విదితమే.. ఇళ్ల లబ్ధిదారులు బ్యాంకు నుంచి పొందిన రుణాలకు వడ్డీని కూడా రీయింబర్స్‌మెంట్‌ చేస్తోంది వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సర్కార్‌.. తొలి విడత లబ్ధిదారులకు వడ్డీని ఈ రోజు రీయింబర్స్‌మెంట్‌ చేయనున్నారు. ఇళ్ల నిర్మాణానికి బ్యాంకులు 9 నుండి 11 శాతం వడ్డీతో రుణాలు ఇస్తుండగా.. మహిళల పై భారం పడకుండా పావలా వడ్డీకే రుణాలు అందిస్తోంది ప్రభుత్వం.. ఇందులో భాగంగా 12.77 లక్షల మందికి 4,500.19 కోట్ల రూపాయలను బ్యాంకు రుణం అందించి ప్రభుత్వం.. ఇక, వీరిలో అర్హులైన 4,07,323 మంది లబ్ధిదారులకు ఇవాళ వడ్డీ రీఎంబర్స్ మెంట్ చేయనున్నారు సీఎం జగన్‌.. 46.90 కోట్లను లబ్దిదారుల ఖాతాల్లో వర్చువల్ గా జమ చేయనున్నారు.. సంవత్సరంలో రెండు సార్లు వడ్డీ రీఎంబెర్స్‌మెంట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే..