చెంగముల్ SHO భారత్ రెడ్డిని HRPS తరఫున ఘనంగా సన్మానించిన జనగాం వెంకట్ రెడ్డి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: చెంగేముల్ పోలీస్ స్టేషన్‌కు ఇటీవల SHO సబ్ ఇన్‌స్పెక్టర్గా బాధ్యతలు చేపట్టిన భారత్ రెడ్డి ని, మానవ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తూ ముందుండే సంస్థ హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ HRPS తరఫున ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని HRPS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ జనగాం వెంకట్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా SHO కు శాలువా కప్పి, ఘనంగా సన్మానించి, అభినందనలు తెలియజేశారు. ఆయన మున్ముందు సేవలు ప్రజల అభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షించారు. SHO భారత్ రెడ్డి ఈ ప్రాంతంలో పటుత్వంతో సేవలందించి మంచి పేరు తెచ్చుకోవాలి. ప్రజల సమస్యలపై స్పందనాత్మకంగా వ్యవహరించడం, లొంగని న్యాయబద్ధమైన చర్యలు తీసుకోవడం ఆయన ప్రత్యేకతగా కలిగివుండాలి అని వెంకట్ రెడ్డి అన్నారు.
ఈ సన్మాన కార్యక్రమంలో HRPS వికారాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్ షా మొహమ్మద్ హుస్సైని ,జిల్లా వాయిస్ ప్రెసిడెంట్ వెంకట్ ముదిరాజ్ , జిల్లా కమిటీ సభ్యులు, మీడియా మిత్రులు ఆంజనేయులు , యువ నాయకులు, సామాజిక సేవకులు పాల్గొన్నారు.
SHO భారత్ రెడ్డి* మాట్లాడుతూ:మానవ హక్కులు, సమాజ శాంతి భద్రతలు నాకు అత్యంత ప్రాధాన్యం. న్యాయం కోసం వచ్చేవారికి ఎప్పుడూ న్యాయం జరిగేలా చూడటమే నా బాధ్యత. ప్రజలతో మమేకం అయ్యి పని చేస్తాను” అని తెలిపారు.HRPS తరఫున పోలీసులు మరియు ప్రజల మధ్య బహుళ భద్రతా విశ్వాసం పెరిగేలా ఈ తరహా కార్యక్రమాలు తరచూ నిర్వహిస్తున్నట్లు అధికారకంగా పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Janagaon Venkat Reddy felicitated

You cannot copy content of this page

Scroll to Top