జూన్ 26, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు, జూన్ 29 : రాజోలు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సామాజిక భవనం పరిరక్షణ అభివృద్ధి కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక కాబడింది. ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమజిల్లా రాజోలు అంబేడ్కర్ సామాజిక భవనంలో పరిరక్షణ అభివృద్ధి కమిటీ సమావేశం ప్రముఖ న్యాయవాది జాలెం భాస్కరరావు అధ్యక్షతన ఆదివారం కమిటీ సభ్యులు నిర్వహించారు. ఈ సమావేశంలో రాజోలు అంబేడ్కర్ సామాజిక భవన పరిరక్షణ అభివృద్ధి కమిటీ చైర్మన్ గా డాక్టర్ గేదెల వరలక్ష్మీని, ప్రధాన కార్యదర్శిగా మట్టా సురేష్ కుమార్ ను, కోశాధికారులుగా చింతా శ్రీనివాస్, చింతా సత్య వరప్రసాద్ లను, నిర్వాహక కమిటీ సభ్యులుగా విప్పర్తి సాయిబాబు, మట్టా ఏడుకొండలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

అనంతరం నూతన కమిటీ సభ్యులు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. నూతన కార్యనిర్వాహక సభ్యులను కమిటీ సభ్యులైన గెడ్డం పేర్రాజు, వైస్ ఎంపీపీ పొలుమూరి శ్యాంబాబు, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా గౌరవాద్యక్షులు దేవ రాజేంద్రప్రసాద్, పీడియం రాష్ట్ర నాయకులు దీపాటి శివప్రసాద్, దళిత చైతన్య వేదిక వ్యవస్థాపకులు బత్తుల మురళీకృష్ణ, చిలకపాటి శ్రీధర్ ఎస్సీ సంక్షేమ సంఘ నాయకులు తోటే ప్రతాప్, కొల్లాబత్తుల సతీష్, మెడబల రాజు కుమార్, జిల్లెళ్ళ వినోద్, బొడ్డపల్లి ప్రసాద్, బుంగ శ్రీను, పుల్లెళ్ళ ఆనంద్, ఎలుమర్తి వెంకట్ తదితరులు అభినందించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Rajolu Ambedkar Social Building

You cannot copy content of this page