Bhu Bharati Act : భూ భారతి చట్టం రెవెన్యూ దరఖాస్తుల డేటా ఎంట్రీ

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: చేయాలి సదస్సుల ద్వారా స్వీకరించిన దరఖాస్తులను అన్ని మాడుల్స్ లో పరిశీలించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తహసిల్దార్లకు ఆదేశించారు. కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు అన్ని మండలా ల తహసిల్దార్ల తో ఏర్పాటు చేసిన సమావేశం లో అయన మాట్లాడుతూ జిల్లా లో రెవెన్యూ సదస్సుల ద్వార వచ్చిన దరకాస్తులను పూర్తి స్తాయీ లో పరిశీలించి డేటా ఎంట్రి చేయాలనీ, గ్రామాలవారిగా రైతుల నుండి తీసుకున్న ప్రతి దరకాస్తు లకు సంబంధించి సాధా బైనామా, ఆర్ఓఆర్ సమస్యలు, పట్టాలో కరెక్షన్స్ వంటి వివిధ సమస్యల పై దరఖాస్తులను పరిశీలించి ఆగస్టు 15 నాటికి పూర్తి అయ్యే విధంగా చూడాలని ఆదేశించారు.
మరణ ద్రువీకరణ బర్త్ సర్టిఫికెట్స్ కు సంబంధించి వెరిఫికేషన్ పూర్తి సర్టిఫికెట్ లు జారి చేయాలనీ ఆదేశించారు. నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీం క్రింద కుటుంబ యజమాని చనిపోతే ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం కోసం అర్జి చేసుకున్న వారి దరకాస్తులను విచారణ చేసి నివేదికలు పంపాలని తహసిల్దార్లకు ఆదేశించారు.
మండలాలలో మహిళా పెట్రోల్ బంక్ ఏర్పాటుకు 20 గుంటల స్థలాన్ని గుర్తించాలని, ఆదేశించారు.
ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ రెవెన్యూ లింగ్యా నాయక్, సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరి, ఆర్ డి ఓ వాసుచంద్ర , అన్ని మండలాల తహసిల్దార్లు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Bhu Bharati Act Revenue

You cannot copy content of this page

Scroll to Top