Protest Rally : యువతి యువకులకు కూటమి ప్రభుత్వం కుట్ర

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, ( పాడేరు ) ఎన్నికల సమయంలో విద్యార్థులకు, నిరుద్యోగ యువతీ, యువకులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి !* “యువత పోరు” నిరసన ర్యాలీ లో పాల్గొన్న మత్స్యరాస విశ్వేశ్వర రాజు. _కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడిచిన ఫీజు రీయింబర్సుమెంట్ చెల్లించకుండా విద్యార్ధులను… ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకుండా, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువతను కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచి మోసం చేసింది.
మోసానికి గురైన విద్యార్ధులకు, యువతకు బాసటగా నిలిచే క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన “యువత పోరు” అనే కార్యక్రమం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంలో, శాసన సభ్యులు అల్లూరి జిల్లా అధ్యక్షులు మత్స్యరాస విశ్వేశ్వర రాజు ఆధ్వర్యంలో విద్యార్ధి, యువజన విభాగాల సంయుక్త అధ్యక్షతన ఈరోజు యువత పోరు నిరసన ర్యాలీ కార్యక్రమం నిర్వహించి, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి డిఆర్వో పద్మాలత కు వినతిపత్రం అందజేశారు.
ఎమ్మెల్యే *మత్స్యరాస విశ్వేశ్వర రాజు మీడియా ముందు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఉద్యోగాలు ఇవ్వక ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఇవ్వక మోసం చేస్తూ విద్యార్థులకు విద్యా దీవెన,వసతి దీవెన, అందక లక్షలాది మంది తీవ్ర కష్టాలు పడుతున్నారని అన్నారు. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలన్న వారికి ప్రభుత్వం సహకారంతో విద్యదివేన, వసతి దీవెన లాంటి పథకాలు ఈ ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదు దానివల్ల విద్యార్థుల తల్లితండ్రులు అధిక వడ్డీలకు అప్పులు చేసి ఫీజులు కట్టాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడిందని అన్నారు. తక్షణమే హామీలు ఇచ్చినటువంటి విద్యా దీవెన వసతి దీవెన బకాయిలను విడుదల చేయాలని తెలిపారు.లేని పక్షాన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో అరకు శాసన సభ్యులు రేగం మత్యలింగం . మాజీ శాసన సభ్యురాలు వైసీపీ ఎస్టీ సెల్ అధ్యక్షురాలు, కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి రాష్ట్ర యువజన ఉపాధ్యక్షులు రేగం చాణక్య యువజన జిల్లా అధ్యక్షులు గబ్బడి శేఖర్ , జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు, లోచలి వరప్రసాద్, జిల్లా మహిళా అధ్యక్షురాలు కురుస పార్వతమ్మ,అల్లూరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మరియు జిల్లా నియోజకవర్గాల వివిధ అనుబంధ విభాగాల నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు ,జెడ్పిటిసిలు, ఎంపీటీసీలు, సర్పంచులు, సీనియర్ నాయకులు ,కార్యకర్తలు, విద్యార్థి విభాగాల నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The coalition government is

You cannot copy content of this page

Scroll to Top