త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, తూర్పుగోదావరి, జూన్ 20: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనపర్తి సమన్వయకర్త,మాజీ శాసనసభ్యులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగులను తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తోందని, దీనికి నిరసనగా జూన్ 23న జిల్లా కలెక్టరేట్ల వద్ద భారీ యువజన ఆందోళన నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఆయన మాట్లాడుతూ, మెస్, ట్యూషన్, హాస్టల్ ఫీజుల చెల్లింపులు పూర్తిగా నిలిచిపోయాయని విమర్శించారు. ప్రభుత్వం నుంచి నిధులు రాలేదని కాలేజీ యాజమాన్యాలు హాల్ టికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందుల బారిన పడేస్తున్నాయని, తల్లిదండ్రులు అప్పులు చేసి ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని విజయ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి కింద ప్రతి ఒక్క నిరుద్యోగుడికి రూ.36,000 చెల్లిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని వైసీపీ అనపర్తి వైసీపీయువజన విభాగం అధ్యక్షుడు దుర్గా రెడ్డి డిమాండ్ చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు పాల్పడుతున్న అధికార ప్రభుత్వం, రాష్ట్ర శాంతిభద్రతల పరిస్థితిని పూర్తిగా గాడి తప్పించిందని విమర్శించారు. రాష్ట్రంలోని నిరుద్యోగులు ప్రభుత్వ వేధింపులకు గురవుతుండటం విచారకరమని డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, తెలిపారు.
ఈ నేపథ్యంలో జూన్ 23న జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన నిర్వహించి, విద్యార్థులు, నిరుద్యోగుల హక్కుల కోసం పోరాటం చేస్తామని ఆయన పిలుపునిచ్చారు. యువత అందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


