తెలంగాణ గిరిజనసంస్కృతి పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు కేతావత్ బాబు రామ్ నాయక్..
దేవరకొండ జూన్18 త్రినేత్రం న్యూస్
దేవరకొండలో విద్యాధికారుల అసాధారణ నిర్లక్ష్యం – గిరిజన విద్యార్థుల హక్కులు పణంగా!
దేవరకొండ, 18-06-2025: దేవరకొండలో శ్రీ చైతన్య స్కూల్‌కు అక్రమంగా అనుమతిని మంజూరు చేసినందుకు నల్లగొండ జిల్లా విద్యా శాఖ ఉన్నతాధికారులు (ఎంఈఓ, డీఈఓ, ఆర్జీడీ)పై తీవ్ర ఆరోపణలు వ్యక్తమయ్యాయి. విద్యార్థుల రాజకీయ పార్టీ జిల్లా అధ్యక్షుడు & గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేతవత్ బాబురాం సమాచారం మేరకు – 2025 జూన్ 11న ఉదయం ఆయన ఈ స్కూల్ నిబంధనల ఉల్లంఘన, అసురక్షిత స్థానం గురించి అధికారులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేసినప్పటికీ అదే సాయంత్రం స్కూల్‌కు అనుమతి ఇచ్చారు.
తీవ్ర ఉల్లంఘనలు:
- స్కూల్ premises నుండి 100 మీటర్ల దూరంలో మద్యం దుకాణం, ఫంక్షన్ హాల్ ఉండటం – ఇది విద్యార్థుల భద్రతా నిబంధనలకు వ్యతిరేకం.
- స్కూల్ ప్రధాన రహదారి పైనే ఉండడం వలన ట్రాఫిక్ ప్రమాదాలకు విద్యార్థులు గురయ్యే ప్రమాదం.
- ఎటువంటి సైట్ ఇన్‌స్పెక్షన్ లేకుండా అనుమతి మంజూరు – ఫిర్యాదును పూర్తిగా విస్మరించడం.
“దేవరకొండ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం అయినప్పటికీ ఈ విధంగా గిరిజన విద్యార్థుల హక్కులు నిర్లక్ష్యం చేయడం తీవ్ర అన్యాయం” అని బాబురాం అన్నారు.
డిమాండ్లు:
MEO, DEO, RJD తక్షణ సస్పెన్షన్.
SC/ST (POA) చట్టం కింద క్రిమినల్ చర్యలు.
స్కూల్ అనుమతి రద్దు.
గిరిజన విద్యార్థులకు భద్రత కలిగిన ప్రభుత్వ పాఠశాలలో తరలింపు.
గిరిజన కుటుంబాలకు నష్ట పరిహారం.
ఈ విషయమై జాతీయ ఎస్టీ కమిషన్ (NCST) కు అధికారిక ఫిర్యాదు సమర్పించగా, కమిషన్ సభ్యులు సానుకూలంగా స్పందించారు. ఈ విషయంపై ఖచ్చితంగా దర్యాప్తు జరిపి చట్టపరమైన చర్యలు తప్పకుండా తీసుకుంటామని హామీ ఇచ్చారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


