బాలు నాయక్….
దేవరకొండ జూన్18 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏకేబిఆర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూనిర్వాసితులకు, పెండ్లిపాకల ఓపెన్ కెనాల్ భూ నిర్వాసితులకు ప్రభుత్వం నుంచి మంజూరు అయిన నష్టపరిహారం చెక్కులను లబ్ధిదారులకు అధికారులతో కలిసి ఎంఎల్ ఏ పంపిణీ చేసారు .
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… AKBR ప్రాజెక్టు,AMR SLBC కెనాల్ ద్వారా భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం నుంచి మంజూరు అయిన నష్టపరిహారం చెక్కులను అందజేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.
గుడిపల్లి మండలంలోని చిలకమర్రి గ్రామానికి చెందిన రైతులు AKBR ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన 12మందికి గాను 68లక్షల రూపాయల విలువ గల నష్టపరిహారం చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా పిఎ పల్లి మండలంలోని బాలాజీ నగర్ గ్రామానికి చెందిన రైతులు AMR SLBC కెనాల్ ద్వారా భూములు కోల్పోయిన 45 మందికి గాను 11.6 కోట్ల రూపాయల విలువ గల నష్టపరిహారం చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.
ఈ ప్రాజెక్టు పూర్తి అయితే పిఏ పల్లి, గుడిపల్లి మండలం సస్యశ్యామలం అవుతాయని తెలిపారు.రైతుల కళ్లల్లో ఆనందం చూసేందుకే ఈ ప్రాజెక్టు చేపట్టామన్నారు. భవిష్యత్ తరాలకు ఈ ప్రాజెక్టు మార్గదర్శకంగా నిలుస్తుందని వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉందని,మీ ప్రతి కష్టాన్ని నా కష్టంగా భావించడం జరుగుతుందని,10 సంవత్సరాలు AKBR ప్రాజెక్టు,SLBC కెనాల్ భూనిర్వాసితుల గురించి పట్టించుకోని బిఆర్ఎస్ నాయకులు పని పట్టుకుని మాపైన బురద జల్లే ప్రయత్నం చేయడం జరుగుతుందని, ప్రజలు వాళ్ళ మాటలపై అప్రమత్తంగా ఉండాలని,నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానని, మీ ప్రతి కష్టం ముందు నేను నిలబడి ఉంటానని,ఎవరికి ఎటువంటి అవసరం ఉన్న నన్ను నేరుగా కలవవచ్చని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు.
చిలకమర్రి,బాలాజీ నగర్ గ్రామానికి చెందిన 57 కుటుంబాలకు ప్రభుత్వం నుండి మంజూరు అయినా పరిహారం చెక్కులను పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని,పరిహారం అందని వారు ఎటువంటి బాధ పడాల్సిన అవసరం లేదనీ మిగిలిన వారికి కూడా త్వరలోనే పరిహారం అదే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమున మాధవ రెడ్డి, నల్గొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా,PACs చైర్మన్ డాక్టర్ వేణుధర్ రెడ్డి,RDO రమణా రెడ్డి,EE డివిజన్ -5 కేతావత్ నెహ్రూ నాయక్,AKBR డివిజన్ -4 DE నాగయ్య, రమేష్,AE లు, ప్రజా ప్రతినిధులు,వివిధ అనుబంధ సంఘాల నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు,మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ కో ఆప్షన్ సభ్యులు,యువజన కాంగ్రెస్ నాయకులు, NSUI నాయకులు, భూ నిర్వాసితులకు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


