MLA Satyananda Rao : ఆత్రేయపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సత్యానందరావు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆత్రేయపురం. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. సోమవారం ఆత్రేయపురంలో రూ.20.65లక్షల వ్యయంతో నిర్మించతలపెట్టిన సీసీ రహదారుల నిర్మాణానికి ఆయన భూమిపూజ నిర్వహించారు. అనంతరం రజకపేటలో 40 వేల లీటర్ల కెపాసిటీతో, రూ.77లక్షల అంచనా విలువతో నిర్మించనున్న వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బండారు కాలనీలో 60వేల లీటర్ల కెపాసిటీతో, రూ.84 లక్షల వ్యయంతో నిర్మించనున్న వాటర్ ట్యాంక్ కు శంకుస్థాపన నిర్వహించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Satyananda Rao laid

You cannot copy content of this page

Scroll to Top