వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: పెద్దేముల్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో 426 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పత్రాలను స్థానిక నాయకులు, అధికారులతో కలిసి పంపిణీ చేసిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి బీభత్సమైన వర్షంలోనూ ఎమ్మెల్యే కార్యక్రమం.
ఈ సందర్భంగా లబ్ధిదారులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ. ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ చేయడం చాలా సంతోషకరం. ఇది ఒక పండగ వాతావరణంగా ఉంది.ఈ పండగకు వరుణ దేవుడు కూడా వచ్చిండు. దశల వారిగా నియోజకవర్గంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు. ఇందిరమ్మ ఇండ్లు కట్టినవారికి అర్హులకు బిల్లులు ఇప్పించే బాధ్యత నాది.
ఈ రోజు ప్రొసీడింగ్ లు తీసుకున్న వారు రేపటి నుండి ముగ్గు పోసి ఇండ్ల నిర్మాణం చేసుకోండి. భూమి, ఇండ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. మొన్ననే కోట్పల్లి ప్రాజెక్ట్ మరమ్మతులకు రూ.90 కోట్లు గౌరవ సీఎం రేవంత్ రెడ్డి , స్పీకర్ ప్రసాద్ కుమార్ సహకారంతో మంజూరు చేయించాను. ఈ ప్రాజెక్ట్ ద్వారా పెద్దేముల్ మండలంలో దాదాపు 14 గ్రామాల రైతులకు లబ్దిచేకూరుతుందిఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత , పెద్దేముల్ మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


