MLA Satyananda Rao : యోగా అనేది మహోన్నత సాధనం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట, యోగా అంటే ఆశయాలు మాత్రమే కాదని అదో మహోన్నత సాధనం అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు.అంతర్జాతీయ యోగ దినోత్సవంలో భాగంగా కొత్తపేట మండలం వాడపాలెం పంచాయితీ కార్యాలయంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యోగా అనేది ప్రాచీన కాలంలో యోగులు,ఋషులు మానవాళికి అందించిన అమూల్యమైన కానుక అని తెలిపారు.యోగా సాధన ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని కోరారు. మనసును, ఆత్మను, శరీరాన్ని ఏకం చేసే శక్తి యోగా సాధన ద్వారా సాధ్యమవుతుందన్నారు.ఇలాంటి మహోన్నతమైన యోగా సాధనకు ప్రపంచ దేశాలు సైతం ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు.ప్రాంగణంలో అందరి చేత యోగా ప్రతిజ్ఞ చేయించిన అనంతరం గ్రామంలో యోగా అవగాహన ర్యాలీని ఎమ్మెల్యే సత్యానందరావు నిర్వహించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Yoga is a great tool

You cannot copy content of this page

Scroll to Top