Medical Camp : ఏడిద సీతానగరంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే, ఏ.పి.యస్.ఐ.డి.సి చైర్మన్

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట మండలం, ఏడిద సీతానగరం గ్రామంలో ఎల్.వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ వారి సౌజన్యంతో ఏర్పాటుచేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సోమవారం రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, ఏ.పి.యస్.ఐ.డి.సి చైర్మన్ వేగుళ్ళ లీలాకృష్ణ, ప్రారంభించారు. తొలుత వీరిని ఏడిద సీతానగరం కూటమి నాయకులు పూలమాలలతో, దుశ్శాలువాలతో వీరు ఇరువురిని సత్కరించారు. అనంతరం ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో ఎమ్మెల్యే వేగుళ్ళ, రాష్ట్ర నీటి పారుదల అభివృద్ది సంస్థ చైర్మన్ లీలాకృష్ణ లకు వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించారు.

ఈ సంధర్బంగా ఎమ్మెల్యే వేగుళ్ళ మాట్లాడుతూ ఈ అవకాశాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లీలాకృష్ణ మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లో ఇటువంటి వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు. అనంతరం ఎల్.వి ప్రసాద్ వైద్యులు ఈ శిబిరంలో గ్రామస్ధులకు కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్ధ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, పిల్లా తాతాలు, గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు, వైద్యులు, తదితర్లు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA and APSIDC Chairman

You cannot copy content of this page

Scroll to Top