MLA Vegulla Jogeswara Rao : కేశవరం, జెడ్.మేడపాడు ఆర్.ఒ.బి లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కేశవరం, జెడ్.మేడపాడు రైల్వే ఓవర్ బ్రిడ్జి ల నిర్మాణం నకు ప్రభుత్వం శాంక్షన్ ఇవ్వటం జరిగిందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, అన్నారు. దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ వారు టెండర్లు కూడా పిలవటం జరిగిందన్నారు. కేశవరం, జెడ్.మేడుపాడు ఆర్.ఒ.బి లతో పాటు కడియం, అనపర్తి లలో కూడా ఆర్.ఒ.బి లకు ప్రభుత్వం శాంక్షన్ ఇవ్వటం జరిగిందన్నారు.

ఈ నాలుగు ఆర్.ఒ.బి లకు కలపి రూ.200 కోట్లకు టెండర్లు కూడా పిలవటం జరిగిందన్నారు. ఈ నెల 23 కి టెండర్లు దాఖలు చెయ్యటానికి ఆఖరిరోజుగా ఎమ్మెల్యే తెలిపారు. ఈ సంధర్బంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధూర్ ఎమ్మెల్యే వేగుళ్ళ ధన్యవాదాలు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Government gives green signal

You cannot copy content of this page

Scroll to Top