తేదీ : 07/06/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చింతలపూడి నియోజకవర్గం, మండలం, నాగిరెడ్డిగూడెం గ్రామంలో డైనమిక్ శాసనసభ్యులు , సంబంధిత ప్రభుత్వాధికారులు గ్రామ ప్రజలు పల్లె నిద్ర స్వర్ణ గ్రామంలో పాల్గొన్నారు. ప్రజలు ఎవరికైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను ఆర్జీ పత్రాలపై క్లుప్తంగా వ్రాసి ఎమ్మెల్యే సొంగా . రోషన్ కుమార్ కు ఇవ్వగా వాటిని తక్షణమే సంబంధిత అధికారుల సే పరిష్కరింప చేయమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వెంటనే వాళ్లు స్పందిస్తూ పరిష్కరింప చేస్తామని హామీ ఇచ్చారు.
ప్రజలు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సంబంధిత పార్టీ కళాకారులు వివిధ కళారూపాల ద్వారా మరియు కూచిపూడి నాట్యం ద్వారా ప్రజలకు అవగాహన తెలిపే విధంగా , పాటల ద్వారా చెడు అలవాట్లను మాని మంచి మార్గంలో ఎలా నడవాలి అనే దానిపై చక్కటి నాటిక ప్రదర్శనాన్ని ఇవ్వడం జరిగింది. ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ అధికారులు పాల్గొని విజయవంతం చేసినారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నాగిరెడ్డి గూడెం గ్రామానికి మంచినీరు, కరెంటు, డ్రైనేజీ, సిసి రోడ్లు తదితర సమస్యలకు పరిష్కారం చేస్తానని హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ గ్రామంలో కూడా మంచి చిన్న, పెద్ద ముసలి కళాకారులు ఉన్నారు ఆ కళలను దూరం పెట్టకుండా మంచిగా సాగించాలని కొనియాడారు. అనంతరం ఇందు భోజనాలు, ప్రతి ఒక్కరికి లోటుపాట్లు లేకుండా చూసుకోవడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


