MLA Vegulla : ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వేగుళ్ళ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముస్లిం సోదర, సోదరీమణులకు రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాల పండుగ బక్రీద్ కాగా, త్యాగం, సహనం ఈ రెండూ బక్రీద్ పండగ ఇచ్చే సందేశాలన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ బక్రీద్ పండుగ జరుపుకుంటారని, త్యాగనిరతికి ఈ పండుగ నిదర్శనమన్నారు. ధనిక, పేద అనే తారతమ్యం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా ముస్లింలందరూ ఈ పండుగను భక్తిశ్రద్దలతో చేసుకుంటారన్నారు. అల్లాహ్ ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ఎమ్మెల్యే కోరుకుంటున్నట్లు చెప్పారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Vegulla extends Bakrid

You cannot copy content of this page

Scroll to Top