జూన్ 26, 2026
TRINETHRAM NEWS

డాక్టర్ జి. అన్నా ప్రసన్న కుమారి, జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు

పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు హెల్త్ వెల్ నెస్ సెంటర్ల యందు మొక్కలను నాటారు. ఆయా ఆసుపత్రిల పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్లాస్టిక్ కవర్లను తొలగించారు. ప్లాస్టిక్ ను తప్పనిసరై వాడినచో వాటిని పునర్వినియోగానికి పంపాలి అని అన్నారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ వాడకం వినియోగం వల్ల కలిగే వాతావరణ కాలుష్యం, తద్వారా జరిగే నష్టాలను ప్రజలకు వివరిస్తూ అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, ప్రతి ఒక్కరు మొక్కలను నాటాలని కోరారు. పర్యావరణాన్ని కాపాడడానికి వారి వంతుగా సహాయం చేస్తానని వైద్య సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

World Environment Day

You cannot copy content of this page