CI Birthday : సి ఐ ముత్తు యాదవ్ జన్మదిన వేడుకలు

TRINETHRAM NEWS

ఫతేనగర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ క్రాంతి ముదిరాజ్ ఆధ్వర్యంలో సి ఐ ముత్తు యాదవ్ జన్మదిన వేడుకలు

కూకట్ పల్లి త్రినేత్రం న్యూస్ జూన్ 2 : ఫతేనగర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ క్రాంతి ముదిరాజ్ ఆధ్వర్యంలో కూకట్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ముత్తు యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కేక్ కట్ చేయించి సి ఐ కి శాలువ తో సత్కరించి పూల గుచ్చాన్ని బహుకరించారు. అనంతరం సి ఐ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చి తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి సి ఐ ముత్తు యాదవ్ ధన్యవాదాలు తెలియచేశారు. కూకట్ పల్లిలో ప్రజా సంక్షేమం, శాంతి భద్రతలు కాపాడడంలో నా బాధ్యతను ఎల్లవేళల నిర్వర్తిస్తానని ఈ సందర్భంగా సి ఐ ముత్తు యాదవ్ తెలియచేశారు. ఈ కార్యక్రమంలో విప్పిన్, నర్సింగ్ రావు, గోపిశెట్టి, కిట్టు, అరుణ్, సాయి, మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CI Muthu Yadav's birthday

You cannot copy content of this page

Scroll to Top