త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. పాఠశాల విద్యాశాఖ తూర్పుగోదావరి వారు నిర్వహించిన డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం కుక్ కం హెల్పర్స్ శిక్షణ మరియు అవగాహన కార్యక్రమం అనపర్తి మండ లం జడ్పీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్ నందు 02/06/2025 న నిర్వహించడమైనది ఈ ఒరియంటేషన్ కార్యక్రమమునకు అనపర్తి మండలంలోని 42 పాఠశాలల నుండి 92 మంది కుక్ కం హెల్పర్స్ హాజరవుట జరిగినది ఈ కార్యక్రమానికి కోర్స్ డైరెక్టర్ అయినటువంటి ఎంఈఓ ఎన్ సత్తిరెడ్డి మాట్లాడుతూ కుక్ కం హెల్పర్స్ అందరూ కూడా పాఠశాల రీఓపెనింగ్ సమయానికి ముందు రోజు హాజరై సామాగ్రినంతటిని శుభ్రపరచవలెను మరియు వాటర్ ట్యాంక్ ను క్లీన్ చేయించి ఆరబెట్టి ఫ్రెష్ వాటర్ ను నింపవలెను అని తెలియజేసినారు అదేవిధంగా పాఠశాల యొక్క మెనూ వివరించడమైనది అలాగనే వంటగది సిబ్బందిలో వ్యక్తిగత పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యతను వివరించి చెప్పడం జరిగింది మరియు చెడిపోవడం కలుషిత నివారించడానికి ఆహార నిల్వ పద్ధతులు భద్రతా ప్రోటోకాల్ ను అనుగుణంగా ఉండాలని తెలియజేయడమైనది తూర్పుగోదావరి జిల్లా ఎం డి ఎం కోఆర్డినేటర్ శ్రీ డి రామకృష్ణ మాట్లాడుతూ మండలంలో ఎంఈఓ మరియు వారి సిబ్బంది యొక్క పనితీరును ప్రశంసించడం జరిగింది అంతేకాకుండా అన్ని ఎండిఎమ్ బిల్లులు సకాలంలో పంపించడంవలన అనపర్తి మండలం మొదటి స్థానంలో ఉన్నది అని తెలియజేయడమైనది అలాగే ఓరెంటేషన్ ప్రోగ్రాం సంబంధించిన సిసిహెచ్ లను ఉద్దేశించి మాట్లాడుతూ బలవద్దకమైన ఆహారం అవసరం ఎందుకు?
మరియు పోషకాహార లోపం నివారణలో పోర్టిఫికేషన్ గురించి వివరించడమైనది అలాగునే ఎండిఎం స్టేట్ రిసోర్స్ పర్సన్ కృష్ణవేణి మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్ ఫైర్ అయినప్పుడు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు దాని నుండి ఎలా తప్పించుకోవాలి , వేసవికాలంలో వడదెబ్బ తగలకుండా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, కాలినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలను వివరించడం జరిగింది. అలాగనే క్లస్టర్ రిసోర్స్ పర్సన్ శ్రీమతి సురేంద్ర కుమారి మాట్లాడుతూ భూకంపాలు ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఎలాంటి ప్రధమ చికిత్స చేయాలి మరియు వాటర్ శానిటేషన్ గురించి, రక్తహీనత రాకుండా ఆకుకూరలు, పండ్లు, డ్రై ఫ్రూప్ట్స్, ఉండే ఆహారం తీసుకొన వలెను అని తెలియజేయడమైనది అలాగునే సి సి హెచ్ అందరి చేత హ్యాండ్ వాష్ 8 స్టెప్పులు చేయించ డమైనది ముఖ్యంగా బియ్యంలో పోర్టిఫైడ్ రైస్ ఉన్న కారణంగా ఎక్కువ వేడి లేకుండా తక్కువ మొత్తము ఉష్ణోగ్రతతో ఉడికించవలెనని బియ్యం రెండుసార్లు కంటే ఎక్కువ కడగ రాదని పిల్లల్లో అన్ని పోషక విలువలు ఉన్నా ఆహారాన్ని ప్రభుత్వం డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం ద్వారా విద్యార్థులకు అందించడం జరుగుతుంది. కావున అందరు కూడా పాఠశాల తెర్చే సమయానికి వస్తువులన్నీ వేడి నీటితో శుభ్రపరచి ఎండలో అరబెట్టి ఉంచవలెను అని తెలియజేయడమైనది ఈ కార్యక్రమానికి వచ్చిన సి సి హెచ్ లందరికీ భోజనం ఏర్పాటు చేయడ మైనది ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకట్ రెడ్డి మరియు మండల విద్యాశాఖ సిబ్బంది అందరూ పాల్గొనడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


