డిండి ( గుండ్లపల్లి)జూన్ 02, త్రినేత్రం న్యూస్. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నేడు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎస్. పి. వెంకన్న జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధులకు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎస్. పి వెంకన్న మాట్లాడుతూ: “తెలంగాణ రాష్ట్రం అనేక త్యాగాల ఫలితంగా ఏర్పడింది. ఉద్యమకారుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివి. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి, న్యాయం, సమానత్వం ఆధారంగా ముందుకు సాగుతోంది,” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమములో మండల ప్రజా పరిషత్ సీనియర్ అసిస్టెంట్ శివానందం, జూనియర్ అసిస్టెంట్ నవీన్ కుమార్, శివాజీ, అజయ్ పొలం సురేష్ వెంకటయ్య రామస్వామి మరియు ఇందిరక్రాంతి పధకం ఉద్యోగస్తులు, సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


