కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ జూన్ 2 : తెలంగాణ రాష్ట్రం కోసం 1969 నుండి ఉద్యమం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను కొనసాగించాలని కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకన్న అన్నారు. సోమవారం కూకట్పల్లి నియోజకవర్గం కెపిహెచ్బి డివిజన్ ప్రధాన రహదారిపై ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కొరకు 1969 నుండి ఉద్యమం చేసిన ఉద్యమకారులకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆశయమే నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా పనిచేసే తెలంగాణ ఉద్యమంలో అమరులైన అమరవీరులకు జోహార్లు తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రెటరీ సుజాత, మీడియా ఇంచార్జి దుర్గాప్రసాద్ రావు, సభ్యులు రాజిరెడ్డి, వీరేంద్ర, కోటేశ్వరరావు, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


