SI Satish Attacks Tribals : ఎస్ఐ సతీష్ గిరిజనుల పై దాడి

TRINETHRAM NEWS

దేవరకొండ మే 31 త్రినేత్రం న్యూస్. నేరేడుగొమ్ము మండలంలో ఈనెల 2వ తేదీన మూల వాగు తండా లో గొడవ జరిగిందని అన్యాయం జరిగిందని కేసు పెట్టడానికి నేరేడు కొమ్ము పోలీస్ స్టేషన్కు వెళితే కంప్లైంట్ తీసుకోకుండా బూతులు తిట్టి బాధితులను కాలుతో తన్నాడు మళ్లీ మూలవాకుతండాలో తేదీ 24 5 2025, 26 తేదీ సోమవారం మళ్లీ గొడవ జరిగిందని బాధితులు 100 కి డయల్ చేసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఎస్సై సతీష్ 26 సోమవారం నాడు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్న మూడవ రెడ్యానాయకులపై ఆసుపత్రిలోని అందరు చూస్తుండగానే ఇష్టానుసారంగా బూతులు తిట్టి బెదిరించడం జరిగింది. ఇది పోలీస్ వ్యవస్థకు ఎంత మాత్రం తగదు ఒకవైపు ప్రాణాలను వారి చేతిలో పెట్టుకొని న్యాయం కోసం వేడు కుంటున్న గిరిజన గిరిజన కుటుంబం మీ అంతు చూస్తానంటూ బెదిరించడం జరిగిందని బాధితులు బాబు నాయక్ రెడ్యా నాయక్ తెలిపారు హాస్పిటల్ కు వచ్చిన ఎస్ఐ ని గిరిజన మహిళలు వేడుకుంటున్నప్పటికీ ఎవరు నన్ను ఏమి చేయలేరు అంటూ మహిళల పట్ల కూడా దురుసుగా ప్రవర్తించి వెళ్లడం జరిగింది.
ఒక పోలీసు ఉద్యోగంలో ఎస్సైగా పనిచేస్తున్న సతీష్ వ్యవహార శైలి సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందని వెంటనే ఎస్సై పై చర్యలు తీసుకుంటూ సస్పెండ్ చేయాలని తెలంగాణ గిరిజన సాంస్కృతిక పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు కేతావత్ బాబురామ్ నాయక్ శనివారం నాడు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు అందజేశారు వారు సానుకూలంగా స్పందించి ఎస్సై సతీష్ చర్యలు తీసుకుంటామని చెప్పి త్వరలో నోటిస్ కూడా పంపిస్తామని చెప్పడం జరిగిందని ఆయన తెలిపారు.

కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

SI Satish attacks tribals

You cannot copy content of this page

Scroll to Top